మా అమ్మ మాలతి చందూర్ కి చాలా పెద్ద ఫాన్.ఆవిడ లాగా మేము కూడా బాగా తెలివికల వాళ్ళము కావాలని మాచిన్నప్పుడు చాలా పుస్తకాలు చదివించేది.అది ఒక వ్యసనమైపోయిమేము ఏ వూరు వెళ్ళినా ఏఇల్లు మారినా దగ్గర లోఓ లైబ్రరి వెతుక్కుంటాను.మేము అక్కడినుంచి వెళ్ళిపోయాక ఆ లైబ్రరి వాళ్ళు నాకోసం చాలా బెగెట్టేసుకుంటారు.ఇప్పటికీ నారాయణగూడా ఆర్.కే లైబ్రరి రషీద్ ,అప్పుడప్పుడూ ఫొన్ చేసి కుశలం అడుగుతుంటాడు.పాపం వాళ్ళ డాడీ అయితేనాకు పుస్తకాలు సరఫరా చేయలేక అబ్ మేరేకొ కితాబ్ చాప్నా పడేగా అని వాపొయేవాడు. అయితే చాపొ అన్నాను .ఆప్లిఖొ మై చాపూంగా అనేవాడు.
ఇంకా ఆ పనికి మాలిన నవలలు చదువుతావు మంచి పుస్తకాలు చదువు అని మా అమ్మ కోపం చేస్తుంది.నేనేమన్నాచిన్నదానా చితకదాన్నా!నా అంతటి దాన్నినేనయ్యను.ఇంకా సమగ్ర ఆంద్ర చరిత్ర చదువూ,కళాపూర్ణొదయం చదువూఅని కోపం చేయటానికి ?ఆ మాట కొస్తే నా మనవళ్ళూ ,మనవరాళ్ళూ కూడా వొప్పుకోరు,వాళ్ళూబెద్దవాళ్ళమయ్యమంటారు.అందరికంటే చిన్నవాడు గౌరవ్ వున్నాడా ,బుడుగు పుస్తకం లోని ఏ పేజీ అయినా తీసిఇవ్వండి టక టకా చదివేస్తాడు.వాడి కి ఐదేళ్ళే ఎలా చదువుతాడని అనుమాన మక్కరలెదు.ఈ మద్య తెలుగునేర్చుకుంటున్నాడు .అం అహ దకా వచ్చేసాయి. వాడి దగ్గర ఎంతమంది టీచరమ్మలు పనిచేసారో తెలుసా !పాపం వాళ్ళుమీ గౌరవ్ కి చెప్పలేము అని కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకునెవారు. కాని ఇప్పుడు వచ్చిన ప్రైవేటు టేచరమ్మ చాలాముదురు.వాడు ఎక్కడ దాక్కున్నా వెతికి చంకలో ఇరికించుకొని తీసుకెళుతుంది.నువ్వు నన్ను హాండిల్ చేయలేవుఅన్నాడే అనుకోండి.అదేమిటో నా ఇంకో మనవడు విక్కీ దగ్గర కూడా చాలా మంది పనిచేసారు. మీకు చెబితే హాచర్యపోతారు.వాళ్ళూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నే వెళ్ళిపోయారు.బురుగు లాగా పట్టీల నిక్కరు వేసుకుందా మను కున్నామాఎక్కడా దొరకలేదు.అంత పెద్ద అమెరికా లో వెతికానా (పట్టీలు అనకూడదుట. సస్పెండర్ అనాలిట) ఎక్కడాదొరకలేదు.కాపోతే తాత కి దొరికాయి.పక్కింటాయన వెళుతుంటే ఈయన పకింటి పిన్నిగారి మొగుడు అంటేతప్పేమిటి?అలా చూస్తాడు.మాకు గద కావాలంటే వద్దు అంటారు,కుక్క తో ఆడుకుంటా మంటే వద్దు అంటారు ,అబ్బబ్బాఈ బెద్దవాళ్ళతో వేగలేక పోతున్నామంటే నమ్మండి.పోనీ ఈల వేద్దామంటే బాబాయిలు వాళ్ళే ఈలలేసుకొని పెళ్ళిచేసేసుకొన్నారు. మీ కెవరికైనా కావలంటే చెప్పండి ,ఘట్టిగా ఈలవేస్తాము.కాపొతే మీ వూళ్ళో జటకా బండి వుంటే చెప్పలిమరి ,మేం వచ్చి ఎక్కుతాం .మాకు ఎవరో నెత్తిన గోరింకా పాటకూడా వచ్చు.ఇంకా అలడీన్ ఖథ పాపాయి ఖథా వచ్చు. బోలెడు అవిడియాలూ ,అభిప్రాయాలూ వున్నాయి కావలంటే మీకూ చెబుతాము.మేమే బుడుగు బుడుగేమేమన్నమాట.జోరుగ గుంజు హైలెస్సా అన్నా విడిపోము.
మీకు తెలుసా!బుడుగు పుస్తకము కోసము నేను నైంటీన్ నైన్ సిక్ష్ నుంచి డికెష్టింగ్ చేస్తే ,టుతౌసండ్ టు లో విశాలాంద్రాపుస్తక ప్రపంచం లో దొరికిందన్నమాట. మేము ఒకటో ఐదో ప్పదో కొన్నాము .మా స్నేహితులందరికీఇచ్చాము.పపంచం లోని పిల్లలంతా బురుగులు(పిడుగులు)కావాలని మా అభిప్రాయం.మీరూ తొందరగా కొనేసి మీపిల్లలకి ఇవ్వండి,మీరూ చదవండి.విశాలాంద్రా పుస్తకాలయాని కి వెళ్ళి మా పేరు చెప్పండి,కుంచం రాయతీఇస్తారు.జాఠర్ ఢమాల్!
ముళ్ళపూడి వెంకటరమణ, బాపు లకు బోలెడు థాంకులు.
ఈ అవకాశమిచ్చిన రెండు జళ్ళ చైతీ కి థాంకు, శుభాశీషులు.
Tuesday, June 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి
2 comments:
nenu monna try chesaanu budugu kosam hyd vachhinappudu but dorakaledu..........ekkada dorukutundo cheppagalara........anduke anantham konna........
nenu koti lo vunna visaalaandra publikeshans lo konnanu. daadaapu 10 copies konnaanu !
Post a Comment