Thursday, July 9, 2009
ఓయ్
మాలా,
ఏమిటి?
సినిమా కెళుదామా?
హడలిపోతూ చూసాను, అపుడెప్పుడో పి.వి.ఆర్ కి ఐదంతస్తులు ఎక్కి, దిగి వచ్చాక ఇక జన్మ లో నీతో సినిమాకి రానన్నారు, ఆ తరువాత ఈమద్య బిగ్ మాక్స్ లో ఏడంతస్తులు ఎక్కి, దిగి ప్రయాణం చూసచ్చాక ఇక నీతో సినిమాకి వస్తే అడుగు అని భీకరం గా ప్రతిజ్ఞ చేసి, ఇప్పుడు మళ్ళీ సినిమా అంటున్నారు, ఈసారి తొమ్మిది అంతస్తులు ఎక్కి దిగాలా !
నా భావాలన్ని మొహం మీద చూపించగల ప్రతిభ వున్నదాన్నవటము వలన, నా భయం మా అబ్బాయి అర్దము చేసుకొని, సినీ మాక్స్ కి వెళ్ళండి. అదైతే రెండంతస్తులే. ఎస్కలేటర్ కూడా వుంది అన్నాడు.అమ్మయ్య అనుకున్నా.
ఓయ్ సినిమా కి టికెట్స్ దొరికాయి. సిద్దార్ద హీరో .ఓ కే చూడవచ్చు.
వ్యతిరేకమైన భావాలు కల హీరో, హీరోయిన్.వారి పేర్లూ అంతే. ఉదయ్, సంద్య. ఉదయ్ ,ఉదయము ఒక దేశం లో రాత్రి ఒక దేశము లో, సంధర్భము ఉన్నా లేకపొయినా పార్టీ లు చేసుకుంటూ కులాశాగా గడిపే ధనవంతుల బిడ్డ. సంద్య ఏమో ఉదయమే లేచి యోగా చేసి, గుడికి వెళుతూ, తనకున్న చిన్న ఇంట్లో చెట్లను పెంచుకుంటూ చుట్టు పక్కలవారి తో కూడా దూరంగా వుంటూ సిస్టమాటిక్ గా జీవితం సాగించే యువతి. ఉదయ్ కి స్వీట్ అండ్ షార్ట్ మెమొరీస్ కావాలి.కాని సంధ్య కి ఏ గుర్తైనా జీవితాంతము గుర్తుండేది గా వుండాలి.స్నేహితురాలి బలవంతము మీద న్యూ ఇయర్ పార్టీ కి వెళ్ళిన సంద్యను చూస్తాడు ,ఉదయ్.ఇక అప్పటి నుంచి ఆమె ప్రేమ లో పడిపోయి, ఆమెను గెలుచుకోవటము కోసం పడరాని పాట్లు పడటమే సినిమా. చివరికి ఏమవుతుంది ? సంధ్య కూడా ఉదయ్ ని ప్రేమిస్తుందా లేదా,ఇద్దరి కి పెళ్ళవుతుందా లేదా అన్నది సినిమా చూసి తెలుసు కోవలసిందే !
ఉదయ్ గా సిద్దార్ద ,లవర్ బాయ్ లా ముద్దుగా వున్నాడు. షామిలి బొద్దుగా ,ముద్దుగా అలనాటి హీరోయినల్లు,సావిత్రి, క్రిష్ణ కుమారి లా చక్కగా హోంలీ గా వుంది.మూడుగంటల సినిమా అయినా బోర్ కొట్టలేదు. రొటీన్ తెలుగు సినిమా కి భిన్నం గా వుంది.మొదటి సగము సరదాగా ,రెండో సగము కొంచము భారం గా వుంది. చాలా చాలా నీట్ గా వుంది ! వెకిలి వేషాలూ, వెకిలి కామెడీ లేవు. దర్శకుడు ఆనంద్ రంగా బాయ్ మీట్ గర్ల్ కథను కొత్తగా ,నీట్ చెప్పటాని కి చేసిన ప్రయత్నము నాకు నచ్చింది. అంతా బాగుంది కాని, పాటలే సంగీతము, సాహిత్యమూ రెండూ నాకర్ధము కాలేదు. కనీసము ఒక్క పాటైనా మెలొడీది పెడితే బాగుండేది. అదేమిటో పాపం ఈ సినిమా లో హీరోయిన్ కి బట్టలు నిండుగా వేసారు ! పాటలలో కూడా హీరో గారి మీద పడటము వగైరా చేయలేదు . . .)) బహుశా కింద పడటాలు, మీద పడటాలు లేకపొబట్టి, హీరోయిన్ వంటి నిండా బట్టలు కట్టుకో వటము వలనా చాలామంది కి నచ్చక పోవచ్చు.ఇది మటుకు దర్షకుడు ప్రయోగము చేసాడనే అనవచ్చు.
సినిమా పేరు చూడగానే ఇది లవ్ స్టోరీ అని తెలిసి పోతుంది. కాబట్టి ,ఇందులో డైరెక్టర్ ఆ కథను మలచిన విధానమును చూడాలి,హీరో ,హీరోయిన్ లను చూసి పాప్ కార్న్ తిని రావాలే కాని, సందేశాల కోసం చూడకూడదు.అల్లాంటివి కావాలంటే దీనికి పోక పోవటము బెటర్.
నాకైతే సినిమా నచ్చింది. కాకపొతే నాకు నచ్చిన సినిమా ఎవరికీ నచ్చదు ! దానితో పాటు థియేటర్ కూడా నచ్చింది. ఎక్కువ మెట్లు ఎక్కే పని లేదు. పైగా 200 రూపాయల టికెట్ కొన్నుకుంటే హాయిగా ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని చూసినట్లు ,పడక కుర్చీ లో కూర్చొని చూడవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి
5 comments:
TOld to be a nice movie.
Hmm. You gave a good review
అత్తయ్య,
నిజంగానే అందరికి నచ్చనిది నీకు నచ్చిందన్నావు! నేను ఈ సినిమా ఇంకా చూడాలేదు. ఇప్పుడు నువ్వు బావుందన్నావు కాబట్టి చూస్తా. అదీ same థియేటర్ లోనే.
ఈ మధ్య మా వాడి పుణ్యమాని నీ బ్లాగ్స్ అన్ని తెగ చదివేస్తున్నాను. కాపోతే మా అమ్మ మీద రాసిన post లో ఆమె అభిప్రాయం ఆమె పాఠం లా కొంచం గొట్టుగా ఉంది. నెక్స్ట్ పోస్ట్ ఎవరి మీదా అని ఎదురు చూస్తూ ఉంటాను. సస్పెన్స్ ఎప్పుడు reveal అవుతుంది?
-శ్రీదేవి
thank you srujana
శ్రీదేవి,
సేం థియేటర్ లో ఆ సినిమా వుందో లేదో !
మరి అది మీ అమ్మ రాసిన పాఠమే కదా ! నేనేమీ మార్చలేదు. మీ అమ్మ పరిచయము మాత్రమే నా సొంతం.
naju gril la vunnavi ekkalante bhayam ekkada agutayonani..............manam close cheyalsina pani vundadu kada...........
Post a Comment