Friday, May 14, 2010

అమ్మా నాన్న



అమ్మ
విత్తనాలని పంటలుగా మార్చే రైతు అమ్మ
మబ్బులుని వానలుగా మార్చె వాన అమ్మ
మన జీవిత నౌకకి తెరచాప అమ్మ
ఈ బ్రహ్మ సృష్టించిన మరో బ్రహ్మ అమ్మ
నాన్న అన్న పదానికి ముందు లేక పోతే అమ్మ అనె పదం
ఆ పదానికి వుండునా నిజమైన అందం
అమ్మ గూర్చి చదవాలంటే చాలునా ఈ చిన్ని జన్మ
ఎంత చదివినా ఒక వాక్యం మిగిలుండే ఉద్గ్రంధం అమ్మ .

నాన్న
నాన్న అన్న పదము కన్న
కమ్మగ వుండదు ఆ వెన్న
లక్షం వైపు దూసుకెళ్ళే బాణం మనమైనా
నాన్నలాంటి విల్లే లేక పోతే దాని ఫలితం సున్నా
నాన్న పెంపకములో కఠినత్వం వున్న
ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన
రేపటి మనకు నిలువుటద్దం నాన్న
అలాంటి నాన్న దేవుడి కన్న మిన్న .

మాతృదినోత్సవం రోజున అమ్మ మీద , నాన్న పుట్టిన రోజున , నాన్న మీద ఈ కవితలు రాశాడు , మా మేనల్లుడు జశ్వంత్ . అవి చూసి వాడేదో పెద్దవాడు అను కోకండి . అదో అప్పుడే గుర్రు మంటున్నాడు , అత్తా నేమైనా చిన్న వాడినా చితక వాడినా ఇప్పుడేగా టెంత్ క్లాస్ కు వచ్చాను అని . ఓకే వొప్పుకున్నాను , నువ్వు కుంచం బెద్దవాడివని సరేనా .అబ్బో వాళ్ళ అమ్మనాన్నల మొహాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయో !!!
ఇలాగే కవితలు రాసి నాకు ఇస్తూ వుండరా బాలకవి . థాంక్ యు జశ్వంత్ .




12 comments:

శివ చెరువు said...

తల్లిదండ్రులు ఇల ప్రత్యక్ష దైవాలు.. All the best for more writings jaswanth..

మరువం ఉష said...

[నా అభిప్రాయం] "ప్రపంచ గమన నిర్ధేశకత్వాన్ని మార్చేది పాతతరం విలువలు మరవనివారు, అవసరపడితే కొత్త వర్తనం ఎంచుకునేవారు." అమ్మానాన్నల పట్ల తన అనురాగం, గౌరవాభిమానాలు ఇలా వ్యక్తపరిచిన చిరంజీవి జశ్వంత్ కి ఆశీర్వాదాలు. ఆ చిన్ని తండ్రిని పెంచిన అమ్మానాన్నలకి అభినందనలు. సార్థకత అన్నది ఈ విషయమని ఆ విషయమని ఎంచి నిర్ణయించపోయినా, తమ పిల్లల శక్తి,సామర్థ్యాలు, ప్రతిభ గమనించినపుడు మాత్రం అమ్మానాన్నల సంతృప్తికి అంతు ఉండదు కదా! నా పిల్లల వలన కలిగిన చిరు/కాస్త అనుభవంతో బోలెడంత భావి కల కనేసి, అనుభూతి ఊహించుకుని అలా సంతృప్త మానసాన ఉన్న తల్లి [నేనూ ఒకనాటికి ఆమె స్థితికి వెళ్తానని :) నమ్మకంతో] మాటగా రాసినదిది - "దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల?" http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html

ఇక ఆ ఆనందాన్ని మనసారా పంచుకున్న అత్తమ్మకి కడోస్..

mala kumar said...

Siva cheruvu gaaru ,

usha gaaru ,

thanks anDi .

జయ said...

జస్వంత్ బాగా రాసావురా కన్నా. అందుకే రా నిన్ను నాతో తెచ్చేసుకుంటానన్నాను. మా అబ్బాయిలాగే ఉన్నావురా నాతో వొచ్చేయరా నేనుపెంచుకుంటానన్నాను. నువ్వు పారిపోయావు. చూసావా ఇదే మీ అమ్మా, నాన్న మీది నీ ప్రేమ. నీకు హృదయపూర్వక అభినందనలు.

Srujana Ramanujan said...

Very nice

memorao said...

chy.jaswanth its pleasent surprise for me.
your love towards parents,,interest on poetry are very nice,
keep it up,all the best.
parvathi.

Anonymous said...

Jaswanth ne aswaridenchena meekandhriki naa namsulu.vadiki elege marintha aswiridinchalene mariyu mee abipriaylani telapalini korukuntu


Jaswanth valla Naana,

Seenu,Gudur

Anonymous said...

Srinu, Chaalaa baagunnayi. Ee vayassu ku avi chaala ekkuva. Kaakapothe, modati line lo ammani rytu to kaakunda vere vasthuvu tho polchivunte baagundedi.

Rendava line lo Vaana nu rendu saarlu vaadakudadu.

Ilaa raastu vunte chaalu, nypunyam vachesthundi.
All the best to Jaswnth.

- - -Dilip Kumar

Anonymous said...

Many Thanks delu,defently he will take ur suggestions,

Seenu

Akka,

Deliph Kumar Naa chinnati friend.vadiki kuda Bavukathavam kontha vundi. Saradha aniti valla Son. Meeru valaintlo konalu vunaru.

Seenu.

మాలా కుమార్ said...

అలాగా , మరి ఈ సలహాలు జస్వంత్ కు చెప్పు.
*సృజన ,
* పార్వతి ,
* దిలీప్ ,
*మీ స్పందనకు ధన్యవాదములు . మీ సలహాలూ , ఆశీస్సులే జశ్వంత్ తో మరిన్ని మంచి కవితలు రాయిస్తాయి . థాంక్ యు .

సవ్వడి said...

jashwanth caalaa baagaa raasaadu.
adee ee vayasulo.. baagundi.

మాలా కుమార్ said...

సవ్వడి గారు ,
థాంక్స్ అండి .

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి