Tuesday, January 26, 2010

స్వాతంత్రం




మా చిన్న తమ్ముడి ( మా పిన్ని చిన్న కొడుకు ) కుమారుడు జస్వంత్ . గూడూరు లో 9 వ తరగతి చదువుతున్నాడు . వాడికి మా కుటుంబ వారసత్వం , కవితలు రాయటము వచ్చినట్లున్నది . కవితలు రాయటము చాలా ఇష్టం . అందుకే రాత్రి అందరూ నిదురపోయిన తరువాత రాసుకుంటూ వుంటాడు . బాబ్బాబు నాకు కవితలు రాయటము రాదురా , కాసిని నీ కవితలు నాకివ్వు , నా బ్లాగ్ లో వేసుకుంటాను అంటే దయతలచి ఇచ్చాడు . అందులో ఒకటి స్వాతంత్రము మీద రాసినది , గణతంత్ర దినోత్సవము సంధర్భముగా .

ఆంగ్లేయు లు మనపై చేసిన కుతంత్రం

ఏమీ చేయలేక పోయింది ఏమాత్రం

సత్య అహింస లనే గాంధీజీ సూత్రం

" ఇంక్విలాబ్ జిందాబాద్ " అన్న ఆజాద్ గాత్రం ,

ఎదుటివారు ఎవర్నైనా చిత్తు చేసే ఖడ్గ మంత్రం

ఎందరో వీరుల రక్త స్తోత్రం వలన

దేశానికి దొరికింది స్వతంత్రం .

కాబట్టి మరువకూడదు వీరందరినీ ఏమాత్రం .


బారతీయు లందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .

8 comments:

Srujana Ramanujan said...

Very nice poem.

మాలా కుమార్ said...

thank you srujana.

జయ said...

ఈ జస్వంత్ గాడి కవితలు మాత్రం బ్రమ్హాండం. నా కంట పడకుండా తప్పించుకున్నాడు. లేకపోతే ఎత్తుకొచ్చేసేదాన్ని. వాడి ఆలోచనలు మాత్రం simply suburb.

మాలా కుమార్ said...

ఏత్తుకెళ్ళిపోతానని ఇంకా ఎంత భయపెడుతావు ? నాకు కవితలు కూడా ఇవ్వకుండా దాక్కుంటున్నాడు .

అశోక్ పాపాయి said...

చాల చక్కగ వుంది కవిత ..నేను స్వాతంత్రము మీద ఎప్పుడును రాయలేదు. కాని జస్వంత్ కవితతో నాకు కళ్లుతేరిచినట్టుయింది..మాల గారు ఆగష్టు15 వస్తుంది కదా ఆ రోజు ఓ చక్కని కవిత మీకు అందిస్తానండి.HAPPY WRITING JASWANTH

మాలా కుమార్ said...

thank you ashok

కొత్త పాళీ said...

quite good.

mala kumar said...

kottapali garu ,

thank you .

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి