ఆనందంలో మనసు తేలియాడినపుడు
తెరలు తెరలుగ తేలివస్తుంది కవిత
విషాదంలో మది ఈదులాడినపుడు
పొరలి పొరలి పొగిలివస్తుంది కవిత
భావోద్రేకంలో హ్రుదయం స్పందించిన
వీరుని మదిలొ వెలిగేను విప్లవ కవిత
ప్రేయసి గుండెలో ప్రేమ పొంగిన
అనురాగపు మదిన అమరమైన కవిత
యిన్ని రీతుల యిలను రూపకల్పనలై
భాసిల్లుతున్న వేల కవితాలతలున్న వేళ
నామదియందు భావనారూపమయిన ఈ కవిత
అనిపించునా నీకు అసంకల్పిత
దేవి....
థాంక్ యు దేవి .
5 comments:
ప్రేయసి గుండెలో ప్రేమ పొంగిన
అనురాగపు మదిన అమరమైన కవిత
ఎన్ని రోజులైన నిలిచిపోయే చిహ్నలు ఈ కవితలు....చాల బాగ రాశారు
అశోక్ పాపాయి ,
మీకు ఈ కవిత నచ్చినందుకు థాంక్స్ అండి .
అమ్మ కవిత నీ బ్లాగ్ లో పుబ్లిష్ చెసినందుకు థాంక్స్ అత్తయ్య
vamsi ,
welcome
Post a Comment