కళ్యాణ వధువుగా పారాణి పాదంతో...
ఈయింట అడుగు పెట్టిననాడు....
"నేటినుండి నీవూ తనయవెతల్లీ" అంటూ....
తలనిమిరి ఆశీస్సులుంచారు .
పనివేళ అమ్మకాళ్ళకు అడ్డుపడె పసివాడిలా
వచ్చిఅత్తగారున్నారేమో.. అని అటు యిటు చూచి,
అమ్మా.... ఒక్కసిప్.... అని అడిగే మామయ్య
పసివారిలా తొచేవారు .
ఎవ్వరినీ నొప్పించక, పరులంటూ భావించక
పదిమందినీ యింటచూసి పరవశించే మామయ్య
పరమాత్మునిలా అనిపించేవారు.
రామకోటి రాస్తూ, రాముడంతటి సౌజన్యమూర్తి ఆయన
ఆమహామనిషి అమృత హృదయాన్ని
అభినందించని వారుంటే... వారు
పాపాత్ములంటే పాపము రాదేమో ! పాపము కాదేమో !!
'మాధవరావంటే "మాధవుడె" అని
మనసారా మెచ్చుకోని మహాత్ములయిన వారెందరో !
అరవయ్యేళ్ళువచ్హినా ఆరునెలల పాపలా పాపమెరుగక
శ్రీహరినే దోచుకోగల ధన్యజీవి మామయ్య
స్వర్ధరహిత స్వచ్చతకు నిదర్శనం
ఆయన సునాయాస స్వర్గయాత్రే
అందరికీ ఆత్మియులై, అభిమానపాత్రులై
మన మనసులనె మందిరాలుగా చేసి నిలిచిన
మా మామయ్య ఎప్పటికీ, మరెన్నటికీ.....
నిత్యసత్యమై వెలుగు చిరంజీవులు
చిరంజీవులు. చిరంజీవులు.. చిరంజీవులు....
కవియిత్రి ; శ్రీమతి . కే .దేవి .
ఈ కవిత , దేవి మా బాబాయి గారు , తన మామగారైన మాధవ రావు గారి గురించి వ్రాసినది .
దేవీ , ఇంకా నీనుండి మంచి కవితలు నా ప్రభాతకమలానికి వస్తాయని ఆశిస్తున్నాను .
థాంక్ యు దేవి .
5 comments:
maamayya gaari gurinchi meru anukunnadi baagaa raasaru aayana atmaku santi kalagaalani korukuntu...
నేను కూడ మీ మామయ్యకు ఆత్మకు శాంతి కలగలని కోరుకుంటున్నాను...మీకు అంతమంచి మామయ్య దొరకడం మీరు చాల అద్రృష్టవంతులు మాల గారు.
చెప్పాలంటే గారు ,
అశోక్ గారు ,
ఈ కవిత నేను రాశింది కాదండి . మా మరదలు రాశింది .
థాంక్స్ అండి
Chala bhagavuntundhi,vadina majaka,
Seenu,Gudur
antegaa seenu .
Post a Comment